అంతర్ జాతీయ స్థాయి ఇండో నేపాల్ జంప్ రోప్ ఛాంపియన్స్ షిప్ 2025 గోల్డ్ మెడల్ సాధించిన పోలు శంకర్ రెడ్డి ని రాయచోటి చెనముక్కపల్లి లో బీజేపీ నాయకులు శివగంగ రెడ్డి ఆధ్వర్యంలో శాలువా కప్పి పూల బొకే అందించి సన్మానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నంద్యాలలో 9 వ తరగతి చదువుతున్న శంకర్ రెడ్డి జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్ జాతీయ స్థాయిలో రాణించడం చాలా అభినందనీయమన్నారు.