
రాయచోటి బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ప్రభాకర్ రెడ్డి
రాయచోటి బార్ అసోసియేషన్ ఎన్నికల్లో శనివారం జరిగిన ఎన్నికల్లో అధ్యక్షులుగా ఎన్. ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. పోలైన 87 ఓట్లలో 48 ఓట్లు ప్రభాకర్ రెడ్డికి రాగా ప్రత్యర్థి రమేష్ రెడ్డికి 39 ఓట్లు వచ్చాయి. ఉపాధ్యక్షులుగా యు. ధనుంజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా పి. రెడ్డి భాస్కర్, ట్రెజరర్ గా పోటీచేసిన ఆదిరెడ్డి నాయక్, లైబ్రరీ సెక్రటరీగా టీవీ రమణ ఎన్నికయ్యారు. వారికి న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపారు.