పాడి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
పాడి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. గురువారం చిన్నమండెం మండలం బోరెడ్డిగారి పల్లెలో నిర్వహించిన ఉచిత గర్భకోశ చికిత్సల శిబిరం, లేగ దూడల ప్రదర్శన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పాడి పశువులను పోషిస్తున్న రైతులకు ప్రభుత్వం అనేక రాయితీలు కల్పిస్తోందని అన్నారు. సబ్సిడీపై గడ్డి విత్తనాలు పంపిణీ చేస్తోందన్నారు.