ప్రతిపాడు: దీపం-2 పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బూర్ల
ప్రతిపాడు నియోజకవర్గం గుంటూరు రూరల్ మండలం ఏటుకూరు గ్రామంలో.. శుక్రవారం ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు కలెక్టర్ నాగలక్ష్మితో కలిసి దీపం-2పథకాన్ని ప్రారంభించారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు అందించడానికి సిద్ధంగా కూటమి ప్రభుత్వం ఉందన్నారు. కుటుంబంలో ఉన్న ప్రతి మహిళను లక్షాధికారిని చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. గ్రామంలోని మహిళలకు గ్యాస్ కనెక్షన్లను అధికారులతో కలిసి అందించారు.