తుని: సానా సతీష్ కు యనమల శుభాకాంక్షలు
రాజ్యసభకు తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపికైన సానా సతీష్ ను టీడీపీ పోలీట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం అభినందనలు తెలిపారు. పార్టీకి సానా సతీష్ అందించిన సేవలను గుర్తించి అధిష్టానం రాజ్యసభకు ఎంపిక చేయడం హర్షణీయమన్నారు. రాజ్యసభకు వెళ్తున్న సతీష్ కు శుభాకాంక్షలు తెలిపారు. తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యనమల దివ్య, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ కూడా శుభాకాంక్షలు తెలిపారు.