అతివేగంతో డివైడర్ ను ఢీకొని బాలుడు మృతి
తుని పట్టణంలోని రైల్వే ఫ్లైఓవర్ వంతెనపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని సీఐ ఎం. గీతారామకృష్ణ తెలిపారు. డ్రైవర్స్ కాలనీకి చెందిన యువకులు బుధవారం తెల్లవారుజామున 2. 30 గంటల సమయంలో బైక్ పై ముగ్గురు ప్రయాణిస్తున్నారన్నారు. అతి వేగం, నిర్లక్ష్యంగా బైక్ నడిపి, పైనున్న డివైడర్ ను బలంగా ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, ఇద్దరికీ తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు.