తుని: పురపాలక ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సమ్మె విరమణ
పురపాలక కార్యాలయంలో ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు చేస్తున్న సమ్మె తాత్కాలికంగా విరమించినట్లు మీడియాకు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ పిలుపుమేరకు గత నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నారు. డిసెంబర్ 18, 19 తేదీల్లో చర్చలకు పిలిచి జీతాల పెంపుదల చేస్తామని హామీతో సమ్మె విరమిస్తున్నామని ఉద్యోగులు గురువారం మున్సిపల్ కమిషనరుకు లేఖను అందించారు.