బూరుగుపూడి ఎయిర్ పోర్ట్ నుంచి నూతనంగా ఏర్పాటు చేసిన విమాన సర్వీసులను కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ పలువురు ఎమ్మెల్యేలతో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వృడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.