నేడు శిల్పారామంలో కూచిపూడి నృత్య ప్రదర్శన
విశాఖ జిల్లా భీమిలి సమీపంలోని కొమ్మాదిలో ఉన్న శిల్పారామంలో ఆదివారం సాయంత్రం కూచిపూడి నృత్య ప్రదర్శన ఉంటుందని పరిపాలన అధికారి టీ. విశ్వనాథ రెడ్డి శనివారం తెలిపారు. వారాంతపు వినోద కార్యక్రమాలలో భాగంగా సాయంత్రం 6 గంటలకు కూచిపూడి, జానపద నృత్యాల ప్రదర్శనను సింహాచలంకు చెందిన సరస్వతీ నృత్య కళామందిర్ ఆధ్వర్యంలో ప్రదర్శించనున్నారని తెలిపారు.