నేడు ద్వారకాతిరుమలలో ఎంపీ పురందీశ్వరి పర్యటన

61చూసినవారు
నేడు ద్వారకాతిరుమలలో ఎంపీ పురందీశ్వరి పర్యటన
రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందీశ్వరి, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు బుధవారం ద్వారకాతిరుమల మండలంలో పర్యటించనున్నట్లు క్యాంపు కార్యాలయవర్గ ప్రతినిధులు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 9 గంటలకు శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేస్తారని అన్నారు. అనంతరం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అలాగే మండల పరిషత్ అభివృద్ధిపై నిర్వహించే సమావేశంలో పాల్గొంటారని అన్నారు.

సంబంధిత పోస్ట్