కాకినాడ నగరంలో పలు ప్రాంతాల్లో కాకినాడ కమిషనర్ భావన గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పలు డివిజన్లో పర్యటించి పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రతి ఇంటి నుంచి తడి పొడి చెత్తను వేరువేరుగా పారిశుధ్య కార్మికులకు ఇవ్వాలని సూచించారు. పారిశుధ్య మెరుగుదలకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఆమె కోరారు. డ్రైన్ లలో చెత్తాచెదారం వేయకూడదని తెలిపారు.