మహిళ అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఆత్రేయపురం ఎస్సై ఎస్. రాము తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ర్యాలి గ్రామానికి చెందిన పల్లేటి జమున రాణి 26 వ తేదీన తన ఇంట్లో మనస్పర్థల కారణంగా ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయిందని, భర్త సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుగుతున్నట్లు ఎస్సై రాము మంగళవారం తెలిపారు.