కొత్తపేట: నిబంధనలకు అనుగుణంగా అమ్మకాలు జరుపుకోవాలి

50చూసినవారు
ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా బాణాసంచా వ్యాపారులు అమ్మకాలు జరుపుకోవాలని కొత్తపేట ఆర్డిఓ పి. శ్రీకర్ వర్తకులకుసూచించారు. కొత్తపేట జూనియర్ కళాశాలఆవరణలో ఏర్పాటుచేసిన బాణాసంచా విక్రయ కేంద్రాలను బుధవారం ఆర్డిఓ శ్రీకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ డివిజన్ పరిధిలో 150 షాపులకు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. రెవిన్యూ, పోలీస్, అగ్నిమాపక శాఖలసమన్వయంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్