మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ వైజాగ్ అధ్వర్యంలో ఆదివారం యానంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని నిర్వహించనున్నట్లు యానాం సూర్య పోలీక్లినిక్ ప్రతినిధులు శనివారం తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ ఉచితంగా ఓరల్ ఎగ్జా మిన్, మోమోగ్రామ్, పాప్స్మియర్ టెస్ట్ తదితర పరీక్షలు నిర్వహిస్తారన్నారు. స్థానికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.