యానాంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

51చూసినవారు
యానాంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
యానాం జీఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణంలో ప్రాంతీయ పరిపాలనాధికారి మునిస్వామి అధ్యక్షతన జరిగిన స్వాతంత్య్ర వేడుకలకు పుదుచ్చేరి ప్రజా పనులశాఖ మంత్రి కె లక్ష్మీనారాయణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీసులు, విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. శాంతి కపోతాలను, మువ్వన్నెల బెలూన్లను గాలిలోకి ఎగురవేశారు. విద్యార్థులు, చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

సంబంధిత పోస్ట్