నేడు రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని కాట్రేనికోనకు చెందిన ప్రముఖ చిత్రకారుడు ఆకొండి అంజి గీసిన చిత్రం ఆకట్టుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోదీకి భారతమాత రాఖీ కడుతున్నట్టుగా ఆయన చిత్రాన్ని గీశారు. భారతగడ్డపై పుట్టిన ప్రతిఒక్కరూ మహిళని సోదరిగానే భావించాలని కోరుతూ తాను ఈ చిత్రం గీశానని ఆయన తెలిపారు. సోదరీమణులకు రాఖీ శుభకాంక్షలు తెలిపారు.