పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ

56చూసినవారు
పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ
67వ అండర్-17 స్కూల్ గేమ్స్ లో పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ముమ్మిడివరం హెల్దీలైఫ్ జిమ్ విద్యార్థి దొమ్మేటి వేణుసాగర్ బంగారు పతకం సాధించినట్లు కోచ్ వాసంశెట్టి సరేష్ ఆదివారం తెలిపారు. సాగర్ 335 కిలోల వెయిట్ లిఫ్టింగ్ చేసి బంగారు పతకం సాధించడంతో పాటు. జాతీయ పోటీలకు అర్హత సాధించారన్నారు. ఈ సందర్భంగా వేణుసాగర్ కు రూ. 40 వేలు విలువ చేసే పవర్ లిఫ్టింగ్ కాస్టూమ్స్ ను ముమ్మిడివరం సీఐ కొండయ్య అందజేశారు.

సంబంధిత పోస్ట్