యానాం కోపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. అభ్యర్థుల నామినేషన్ పత్రాలు పరిశీలన, తిరస్కరణ, ఉపసంహరణ అనంతరం 9మంది అభ్యర్థులకు 8మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని యానాం స్టోర్స్ ఎన్నికల అధికారి మహ్మద్ అబ్బుల్ రజార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికైన వారిలో అధిక శాతం పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిది మల్లాడి కృష్ణారావు ప్యానల్ కావడంతో మల్లాడి ఇంటి వద్ద బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు.