ఓఎన్జీసీ సంస్థ ద్వారా మత్స్యకారులకు చెల్లించాల్సిన నష్టపరిహారం అందించేందుకు సీఎం చంద్రబాబునాయుడు ఈనెల 27వ తేదీన మురముళ్లకు విచ్చేస్తున్నట్లు వాట్సాప్ గ్రూపుల్లో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పేర్కొన్నారు. మత్యకారులకు నష్టపరిహారం చెల్లింపుపై ఓఎన్జీసీ సంస్థతో చర్చలు కొనసాగుతున్నాయన్నారు. మత్స్యకారులకు ఎప్పుడు పరిహారం అందించేది త్వరలోనే ప్రకటిస్తామన్నారు.