పిఠాపురం: వాహన చోదకులు జాగ్రత్తలు పాటించాలి

52చూసినవారు
పిఠాపురం: వాహన చోదకులు జాగ్రత్తలు పాటించాలి
వాహన చోదకులు జాగ్రత్తలు పాటించాలని, అతి వేగం పనికిరాదని సీఐ జి. శ్రీనివాస్, ఎస్సై మణికుమార్ తెలిపారు. గురువారం రాత్రి పిఠాపురం పాదగయ, ఉప్పాడ సెంటర్ కూడళ్లలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారా అని ప్రశ్నిస్తూ శ్వాస పరీక్ష చేశారు. నంబరు ప్లేట్లు లేకుండా, అవసరమైన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా, 14 ఏళ్లలోపు పిల్లలు వాహనాలు నడుపుతుండగా వారికి కౌన్సెలింగ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్