పిఠాపురం నియోజకవర్గం నవఖండ్రవాడకు చెందిన రైతు చక్రవర్తుల శ్రీనివాస్ కుమార్తె సత్య జగదీశ్వరి ఇటీవల నీట్లో మంచి ర్యాంకు సాధించి వైద్య విద్యకు అర్హత సాధించింది. కళాశాలలో చేరేందుకు ఆర్ధిక ఇబ్బందులతో సతమతవుతుండగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి పిఠాపురం జనసేన నాయకులు తీసుకెళ్లారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి వారిని రమ్మని సోమవారం రాత్రి రూ. 4 లక్షల ఆర్థిక సాయంగా చెక్ ను అందజేశారు.