తూ. గో జిల్లాలో ధాన్యం సేకరణ దాదాపు పూర్తయిందని జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆమె మాట్లాడారు. జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సంబంధించిన నగదు 48 గంటలలోపే రైతుల బ్యాంకు ఖాతాలోకి జమ చేయడం జరిగిందన్నారు. ఆధార్ లింక్ సరిగ్గా లేని బ్యాంకు ఖాతాలకు నగదు ఫెయిల్యూర్ అవుతుందన్నారు. ఈ సమస్యను కూడా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.