క్షేత్రస్థాయిలో భూ సంబంధ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం గ్రామ రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని కలెక్టర్ ప్రశాంతి అన్నారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం హుకుంపేట వద్ద అధికారులు బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సును కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారులు గ్రామాలలో రెవెన్యూ సదస్సులను ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.