రాజానగరం: సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం
సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం అని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు. శనివారం రాజానగరంలోని లాలాచెరువు హోసింగ్ బోర్డు కాలనీలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులు తెలియజేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.