తుని పట్నంలోని పురపాలక కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్ పర్సన్ ఏలూరు సుధారాణి పాల్గొని జెండా ఆవిష్కరించారు. అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మున్సిపల్ కమిషనర్ వెంకట్రావు, డి ఈ ప్రకాశరావు, ఆఫీస్ సిబ్బంది, వార్డ్ కౌన్సిలర్ పామర్తి మహేష్, చింతల సునీత, కర్రీ శ్రీదేవి, కాసే సుమతి, జీవరత్నం తదితరులు పాల్గొన్నారు.