తునిలో గల్లంతైన మృతదేహం లభ్యం

74చూసినవారు
తునిలో గల్లంతైన మృతదేహం లభ్యం
కాకినాడ జిల్లా తుని కట్రాల కొండ తాండవనిధిలో రెండు రోజుల కిందట గల్లంతైన వ్యక్తి మృతదేహం సోమవారం లభ్యమయింది. శనివారం మధ్యాహ్నం బహిర్భూమికి వెళుతుండగా నీటిలో ఆ వ్యక్తి పడిపోయినట్లుగా స్థానికులు తెలిపారు. అప్పటి నుంచి గాలింపు చర్యలు చేపట్టిన మృతదేహం లభ్యం కాలేదు. తాజాగా సోమవారం తాండవ నది శివారులో తేలుతూ మృతదేహం కనిపించింది. దీంతో మృతుడు స్వగ్రామమైన రేఖవాణిపాలెంలో విషాద చాయలు అలముకున్నాయి.

సంబంధిత పోస్ట్