రౌతులపూడి మండలంలోని రాజవరం నుంచి దిగువశివాడ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి ప్రస్తుతం అధ్వానంగా మారింది. ఇటీవల కురుస్తున్న వర్షాలు కారణంగా రోడ్డు మరింత ఛిద్రమైంది. అసలు రోడ్డెక్కడుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. పెద్ద గుంతలు, బురద కారణంగా వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయని వాహన చోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.