అవనిగడ్డ మండల పరిధిలోని పులిగడ్డ వద్ద ఉన్న ఆక్విడెక్ట్ శుక్రవారం ఉదయానికి పూర్తిగా బయటపడింది. 11 లక్షల మేర ఎగువ నుంచి వరద నీరు రావడంతో పూర్తిగా మునిగిపోయిన ఆక్విడెక్ట్ ప్రస్తుతం 1. 43 లక్షల క్యూసెక్కుల వరద నీరు మాత్రమే దిగువకు విడుదల అవుతూ ఉండడంతో దివిసీమ ప్రాంత వాసులు ఊపిరి పీల్చుకున్నారు. క్రమేపీ వరద నీరు తగ్గడంతో ప్రజలు ఇళ్లల్లోకి వెళ్తున్నారు.