ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రంలో సోమవారం సస్యరక్షణ శాస్త్రవేత్త డా. రేవతి ప్రకృతి వ్యవసాయంలో బీజామృతం తయారీ విధానాన్ని నైపుణ్యత ప్రదర్శన ద్వారా రైతులకు తెలియచేశారు. ఈ బీజామృతం వివిధ పంటలలో తక్కువ ఖర్చుతో విత్తన శుద్ధికి మరియు కూరగాయ మొక్కల నారు శుద్ధికి వినియోగించుకోవచ్చని అన్నారు. తద్వారా చీడ పీడలు నుండి పంటకు రక్షణ కలుగుతుందని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.