నాణ్యత ప్రమాణాలతో సిసి రహదారి నిర్మాణ పనులు చేపట్టాలని పంచాయతీ రాజ్ డిఈ పగడాల సురేష్ అన్నారు. మోపిదేవి మండల పరిధిలోని మేళ్లమర్తి లంక గ్రామంలో సిమెంట్ రహదారి నిర్మాణ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. 125 మీటర్ల సిమెంట్ రహదారి నిర్మాణం కోసం రూ. 4. 60 లక్షల నిధులతో రహదారి నిర్మాణం జరుగుతుందని తెలిపారు. మోపిదేవి పంచాయతీరాజ్ శాఖ ఏఈ బొప్పన శ్రీనివాసులు పాల్గొన్నారు.