కేంద్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామపంచాయతీ స్పేషల్ డెవలప్మెంట్ ప్లాన్ నేషనల్ ప్రోగ్రాంలో కృష్ణా జిల్లాలోని తేలప్రోలు, పరిటాల గ్రామాలు ఎంపికయ్యాయి. తేలప్రోలులో గురువారం జరిగిన సమావేశంలో స్టేట్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్రీనాథ్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ విజయవాడ సహకారంతో ఈ పైలట్ ప్రాజెక్టు పూర్తి చేస్తామని తెలిపారు.