మచిలీపట్నం: నైపుణ్య గణనకు పటిష్టవంతమైన ఏర్పాట్లు చేయాలి
జిల్లాలో నైపుణ్య గణనకు పటిష్టవంతమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డీకె. బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు, గ్రామ వార్డు సచివాలయ అధికారులతో శనివారం మచిలీపట్నం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలో నిర్వహించు నైపుణ్య గణనపై చర్చించారు. రాష్ట్రంలో నైపుణ్య గణన తొలుత పైలట్ ప్రాజెక్టుగా మంగళగిరిలో నిర్వహించారన్నారు.