బుడమేరు వరదకు రహదారులు విలవిల
కృష్ణా జిల్లాలో బుడమేరు పొంగడంతో రహదారులు ధ్వంసమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 85. 54 కి. మీ మేర రహదారులు ధ్వంసమయ్యాయి. 25 ప్రాంతాల్లో ఉపరితలాలు దెబ్బతిన్నాయని వాటికి 68. 65 కోట్లు అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. కృష్ణా జిల్లా పంచాయతీరాజ్ శాఖ రహదారులు 434. 6 కి. మీ మేర ధ్వంసంమయ్యాయి. మొత్తం 209 రహదారులు వరదలకు పాడయ్యాయి. వీటి మరమ్మతులకు రూ. 60 కోట్లు ఖర్చు అవుతుందని శనివారం చెప్పారు.