గోసంతతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని వైసీపీ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరుతూ గురువారం బాలకృష్ణ గురుస్వామి చేపట్టిన గోరక్ష మహాపాదయాత్ర 112 వ రోజున విజయవాడకు చేరుకుంది. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై స్వామీజీని కలిసి యాత్రకు మల్లాది విష్ణు తన మద్ధతు తెలియజేశారు.