ట్రాక్ కిలోమీటర్లు, రైళ్ల కార్యకలాపాల నిర్వహణ మరియు ఆదాయాపరంగా భారతదేశంలోని అతిపెద్ద రైల్వే జోన్లలో ఒకటైన దక్షిణ మధ్య రైల్వేకు ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్(పి. సి. సి. ఏం)గా ఎన్. రమేష్ గురువారం పదవి బాధ్యతలు స్వీకరించారు. 30 సంవత్సరాల తన కెరీర్లో, భారతీయ రైల్వేలలో బెంగళూరు డివిజన్లో సీనియర్ డివిజనల్ సేఫ్టీ ఆఫీసర్, న్యూఢిల్లీలోని రైల్వే మంత్రికి డైరెక్టర్/పబ్లిక్ పదవులను నిర్వహించారు.