గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటుందని గురువారం జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మిశ, నగర పోలీస్ కమీషనర్ పి. రాజశేఖర్ బాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్‌కు వివరించారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వప్రధానకార్యదర్శికె. విజయానంద్ అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.