ఆంధ్ర క్రికెట్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)ను విశాఖకు చెందిన టీమ్ ఇండియా క్రికెటర్ కె. నితీష్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. గురునానక్ కాలనీలోని కేశినేని శివనాథ్ నివాసంలో గురువారం కలవటం జరిగింది. ఏసీఏ అధ్యక్షుడు, ఎంపి కేశినేని శివనాథ్ తో పాటు ఏసీఏ కార్యదర్శి రాజ్యసభ ఎంపి, క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి కి సాదర స్వాగతం పలికి పుష్పగుచ్ఛం అందించారు.