గత ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి పెండింగ్ లో పెట్టిన సుమారు రూ. 1770 కోట్ల మేర అప్పుల్ని ఎన్డీయే ప్రభుత్వం తీర్చిందని గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ సోమవారం పేర్కొన్నారు. ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టితో డిజిటల్ పరిజ్ఞానం మరియు సృజనాత్మకత ఉపయోగించడం ద్వారా ఆరోగ్య సంరక్షణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విప్లవాత్మక మార్పుల్ని తీసుకొస్తోందని గవర్నర్ తెలిపారు.