అవనిగడ్డలో ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు

56చూసినవారు
అవనిగడ్డలో ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సినీ హీరో బాలకృష్ణ జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం సాధించి చరిత్రలో నిలిచిన గొప్ప వ్యక్తి నందమూరి బాలకృష్ణ అని కొనియాడారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నామన్నారు.