విజయవాడ - ఏలూరు జాతీయ రహదారిపై శనివారం ప్రమాదం చోటు చేసుకుంది. రాంగ్ రూట్ లో 100 కిమీల వేగంతో వచ్చిన ో కారు ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొంది. ఈ ఘటనలో రెండు కార్లు దెబ్బతిన్నాయి. ఆయా కార్లలో ప్రయాణిస్తున్న వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని గన్నవరంలోని పిన్నమనేని ఆసుపత్రిలో గల ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.