బాపులపాడు మండలం బండారు గూడెం గ్రామంలో సోమవారం సిపిఎం పార్టీ నాయకుడు బర్రె లెనిన్ పంచాయతీ వాటర్ లైన్ లీకేజీ ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్బంగా గ్రామస్థులతో మాట్లాడిన ఆయన, నీటి లీకేజీల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరంగా తెలుసుకున్నారు. సమస్యలను పరిశీలించిన తర్వాత ఆయన పంచాయతీ అధికారులను వెంటనే స్పందించి లీకేజీ సమస్యను త్వరగా పరిష్కరించాల్సిందిగా డిమాండ్ చేశారు.