ఆవులను అక్రమంగా తరలిస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకున్న సంఘటన గన్నవరం నియోజకవర్గంలో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి ఆత్కూరు పోలీసులు ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్గేట్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో అక్రమంగా ఆవులను తరలిస్తున్న రెండు వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.