మారుమూల గ్రామాలకు సైతం అభివృద్ధి ఫలాలు అందేలా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు కృషి చేస్తున్నారని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. మండల కేంద్రమైన గుడ్లవల్లేరులో రూ. 52 లక్షల నిధులతో నిర్మాణం పూర్తి చేసుకున్న పోల్ రాజ్ కెనాల్ గట్టు రోడ్డును ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రారంభించారు.