పిల్లలు, టీచర్లు, తల్లిదండ్రులని ఒక దగ్గర కలిపిన లోకేష్ నిర్ణయం అద్భుతమనీ గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడ్లవల్లేరు మండలం కౌతవరం జిల్లా పరిషత్ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. తొలుత ఎమ్మెల్యే రాముకు విద్యార్థులు స్వాగతం పలికారు. పాఠశాలలోని శ్రీ సరస్వతి అమ్మవారి విగ్రహానికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.