జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం భీమవరం గట్టు నేషనల్ హైవే పై క్రాసింగ్ వద్ద రోజు వారీ ప్రమాదాలు జరగటం పరిపాటేనని చెప్పుకోవచ్చు. జగ్గయ్యపేట ఆర్. టి. ఓ సైతం ఈ టోల్ గేట్ సమీపంలో వాహనాల తనిఖీలు చేయడం రోజు జరుగుతుంది. ఈ వాహనాల తనిఖీల వెనుకాల గల మర్మం ఏమిటో వాహనదారులకు అర్థం కావడంలేదు. సాక్షాత్తు ఆర్టిఓ వాహనాల తనిఖీలు జరుగుతున్నప్పటికి తూతూ మంత్రంగా మాత్రమే వాహనాలను తనిఖీలు జరుగుతున్నాయి.