పంట కాల్వలు, చెరువులను మెరుగు పరచాలని అర్జీ

2159చూసినవారు
పంట కాల్వలు, చెరువులను మెరుగు పరచాలని అర్జీ
జగ్గయ్యపేట మండల తహశీల్దార్ వైకుంఠరావుకు మండల తహశీల్దార్ కార్యాలయంలో జరిగిన స్పందనకి సామాజిక కార్యకర్త మెటికల శ్రీనివాసరావు, బిసీ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు గడ్డం రాంబాబు, సేవా కార్యకర్త షేక్ హమీద్ లు కలసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జగ్గయ్యపేట మండలం, పట్టణ పరిధిలో సాగు భూమి, చెరువులున్నాయి. సాగు భూమి పంటలు పండించడానికి మరియు చెరువులు నీటితో నింపడానికి సాగర్, కృష్ణా ఆయకట్టు, మేజర్, మైనర్ పంట కాల్వలు, ఎత్తిపోతల ద్వారా నీటిని పారుదల చేయడం జరుగుతుంది. పంట కాల్వలు కొన్నిచోట్ల ఆక్రమణలకి గురౌవడం, సరైన పూడికలు తీయకపోడంతో చివరికంట పంటపొలాలకు సాగుకు నీరు అందించడం జరుగుతుందని, కాల్వల ద్వారా చెరువులను నింపి ఎండాకాలం నీటి ఎద్దడి లేకుండా చూస్తున్నారని యంఆర్ఓ కి గుర్తు చేశారు. కాల్వలు బూడిపోడం, ఆక్రమణలకు గురికావడంతో రైతులు, ప్రజలు నీటిపారుదల లేక తీవ్ర అసౌకర్యాన్నికి గురౌతున్నారు. వెంటనే ప్రతి ఎకరానికి నీరు అందించేలా, నీటి ఎద్దడి లేకుండా ముందస్తుగా చెరువులను పుష్కలంగా నీటితో నింపాలని వారు స్పందన కార్యక్రమంలో అర్జీ ద్వారా యంఆర్ఓ కు విన్నవిస్తూ సమస్యలను త్వరితంగా పరిష్కరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్