నూజివీడు స్థానిక యంపిడి వో కార్యాలయ సమావేశ మందిరంలో నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి మండలాలకు సంబంధించిన త్రైమాసిక జె యం ఎల్ బి సి సమావేశం గురువారం జరిగింది. సమావేశంలో డి ఆర్ డీ ఏ పిడి ఆర్. విజయరాజు, నాబార్డ్ డి డి ఎం అనిల్ కాంత్, ఎల్ డి ఎం నీలాద్రి, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా కౌలు రైతు ఋణాలు, పశుపోషణ నిమిత్తం రైతులకు కేసీసీ ఋణాల పై చర్చించారు.