పామర్రు నియోజకవర్గంలోని తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెం వీఏఏ ఆయేషా మీరాని బుధవారం సస్పెండ్ చేశారు. ధాన్యం విక్రయాల్లో రైతుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు వీఏఏను సస్పెండ్ చేస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు. ధాన్యం కొనుగోళ్లలో అధికారులు స్పందించడం లేదంటూ తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెం గ్రామంలో రైతులు ధర్నా నిర్వహించారు.