పెనుమలూరులో సోమవారం రాత్రి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. గంజాయి మత్తులో బ్లేడ్ తో కొన్ని రోజులుగా గ్రామంలో దాడులు చేస్తున్న యువకుడిని గ్రామస్థులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. దాడిని అడ్డుకొని యువకుడిని పోలీస్ స్టేషన్ కు తరలించే క్రమంలో పోలీసులను అడ్డుకోవడంతో గ్రామస్థుల పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎట్టకేలకు యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి పెనమలూరు పిఎస్ కు తరలించారు.