పెనమలూరు: శ్రీనివాసరావు సేవలు మరువలేనివి

56చూసినవారు
రిపోర్టర్ శ్రీనివాసరావు సమాజానికి చేసినటువంటి సేవలు ఎప్పటికీ మరువలేమని పలువురు వక్తలు కొనియాడారు. కొద్దిరోజుల క్రితం గుండెపోటుతో మరణించిన పెనమలూరు నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ శ్రీనివాసరావు సంస్కరణ సభ గురువారం ఉయ్యూరులో పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ సమాజ అభివృద్ధి కోసం పాటుపడిన శ్రీనివాసరావు అకాల మరణం చెందటం దురదృష్టకరమన్నారు.

సంబంధిత పోస్ట్